Nellore: నెల్లూరు సిటీలో రూ. 50.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Nellore: నెల్లూరు సిటీలో 56 మంది లబ్ధిదారులకు రూ. 50.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నారాయణ.

V. Narasimhulu, Nellore
Published on: 27 Jun 2026 9:39 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు సిటీలో రూ. 50.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

నెల్లూరు: సిటీ నియోజకవర్గంలోని 56 మందికి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ...

సీఎం సహాయనిధి పేదల పాలిట వరం అని, ఆర్ధిక ఇబ్బందులు ఉండి, సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసిన వారందరికీ సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఈరోజు సిటీ లోని 56 మందికి రూ. 50,34,141/- విలువైన చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. రెండేళ్లలో 469 మందికి రూ. 4,55,33,833/- విలువైన చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు.

పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలని నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నేత్రజ్యోతి,దంత సురక్ష ప్రారంభించిందని చెప్పారు.

నాలుగు నెలల్లో 10 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆరు వేల మందికి కంటి అద్దాలు ఉచితంగా అందచేశారని, ఐదు వేల మందికి దంత పరీక్షలు నిర్వహించారని చెప్పారు.అభివృద్ధి,సంక్షేమానికి తమ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని,

చండీఘర్ తరహాలో నెల్లూరుని గ్రీన్ సిటీ చేస్తామని, ప్రభుత్వ హైస్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని, అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. సద్విమర్శలు చేస్తే స్వీకరించి సరిచేసుకుంటామని, ప్రతీది రాజకీయం చేసి, లబ్ధి పొందాలని చూడటం సరికాదని హితవు పలికారు.

వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే జన ఛీత్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జడ్పిటిసి విజేతా రెడ్డి,నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు,కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, డివిజన్ల టీడీపీ నేతలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story