Nellore: ఉచిత సైకిళ్ల పంపిణీ: మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరు రూరల్ పరిధిలో 1,320 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు.

A Praveen, Nellore
Published on: 8 Oct 2026 10:37 PM IST
Nellore
X

Nellore: ఉచిత సైకిళ్ల పంపిణీ: మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ!

నెల్లూరు: పేద విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో మంత్రి నారాయణ చేపట్టిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. సొంత నిధులతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 1,320 సైకిళ్లను గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. దర్గామిట్ట జెడ్పీ హైస్కూల్‌ మైదానంలో జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలిరావడంతో ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది.

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 11 ప్రభుత్వ హైస్కూళ్లలో తొమ్మిదో తరగతి చదువుతున్న 770 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ పొంగూరు షరణి సైకిళ్లను పంపిణీ చేశారు. కేఏసీ కాలేజీకి చెందిన మరో 550 మంది విద్యార్థులకు కూడా సైకిళ్లు అందజేశారు. సైకిళ్లు అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది.థాంక్యూ నారాయణ సార్‌ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నా బాల్యంలో సైకిల్‌ కొనుగోలు చేసే స్థోమత లేక మూడు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాడినని,

పేద విద్యార్థులు నాలాగా నడిచి స్కూల్‌కు వెళ్లకూడదనే ఉద్దేశంతో సొంత నిధులతో సైకిళ్లు అందిస్తున్నానన్నారు. సిటీ, రూరల్‌ పరిధిలోని ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న 10 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.6 కోట్లతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే నారాయణ ముఖ్య కారణమన్నారు.. నెల్లూరు రూరల్ కు సైకిళ్లు అందించిన నారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మేయర్‌ నందిమండలం భానుశ్రీ, మాజీ కార్పొరేటర్‌ దొడ్డపనేని రాజానాయుడు, సిటీ టీడీపీ నేతలు జహీర్‌, బాలాజీ, తిరుమలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె షరణిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సన్మానించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore