Nellore: మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ
Nellore: నెల్లూరు నగరంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మంత్రి పొంగూరు నారాయణ.
Nellore: మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ
Nellore: బలిజ భవన్, చర్చిలకు భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట నిలబెట్టుకున్నారు..ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. మాట ఇస్తే తప్పనని నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రి క్యాంపు కార్యాలయంలో, బలిగిపోవడానికి చర్చికి చెక్కులు అందజేశారు మంత్రి నారాయణ కుమార్తె షరణి. ప్రజా రుణం తీర్చుకోవడమే నాన్నగారి లక్ష్యం అని అన్నారు పొంగూరు షరణి.
మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. హామీ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే 14 వ డివిజన్ లోని బలిజభవన్ కి 25 లక్షలు,50 వ డివిజన్ బుజ్జమ్మ రేవులోని జెమ్స్ ఆఫ్ జీసెస్ చర్చి కి 2 లక్షలు సొంత నిధి నుంచి కేటాయించారు. అందుకు సంబంధించిన చెక్కులను మెడికల్ కాలేజ్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కుమార్తె షరణి బలిజభవన్ కమిటీ సభ్యులు,చర్చి పాస్టర్ లకు సోమవారం అందచేసారు.
అనంతరం షరణి మీడియాతో మాట్లాడుతూ..
సిటీ నియోజకవర్గం ప్రజలు తన తండ్రిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, నగర అభివృద్ధే ధ్యేయంగా ప్రజా రుణం తీర్చుకునేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు. నెల్లూరు సిటీ ప్రజలకు ఎల్లప్పుడూ తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు.ఇచ్చిన మాట ప్రకారం నాన్నగారి ఆదేశాలతో నారాయణ విద్యాసంస్థల తరఫున బలిజ భవన్‌కు 25 లక్షలు, జెమ్స్ ఆఫ్ జీసెస్ చర్చి అభివృద్ధికి 2 లక్షల విరాళాల చెక్కులను అందచేసినట్టు తెలిపారు.గతంలో కూడా కాపు భవన్‌కు 2 కోట్లు, బలిజ భవన్‌కు 30 లక్షలు, బీసీ భవన్‌కు 1 కోటి,కోటమిట్ట షాదీ మంజిల్ కి 1 కోటి,54 వ డివిజన్ లో షాదీ మంజిల్‌కు
50 లక్షలు ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తమ కుటుంబ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ అభిమతమని షరణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ భవన్ కమిటీ సభ్యులు డివీఎస్ గిరి, పసుపులేటి రామ్మూర్తి, గుణుకుల మల్లయ్య, రావి హనుమంతరావు, లక్ష్మణరావు, జెమ్స్ ఆఫ్ జీసెస్ చర్చి పాస్టర్ జెరోమ్, 50వ డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధయ్య మరియు ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు.




