Nellore: కార్పొరేట్ వైద్యాన్ని పేదల ముంగిటకే తెచ్చిన మంత్రి నారాయణ

Nellore: నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 4 July 2026 9:30 AM IST
Nellore
X

Nellore: కార్పొరేట్ వైద్యాన్ని పేదల ముంగిటకే తెచ్చిన మంత్రి నారాయణ

Nellore: నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సేవా సంకల్పంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 9వ డివిజన్ బంగ్లాతోటలో జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ ఆధ్వర్యంలో అప్రతిహతంగా జరిగింది.

ఈ సందర్భంగా కువ్వారపు బాలాజీ మాట్లాడుతూ.. కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేదల ముంగిటకే తెచ్చేందుకు 3 కోట్ల రూపాయలతో అత్యాధునిక నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ వాహనాన్ని మంత్రి ఏర్పాటు చేశారని, ఈ సేవా యజ్ఞంలో భాగంగా ఇప్పటివరకు నెల్లూరు నగరంలో 9,300 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, 5,000 మందికి పైగా ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశామని వెల్లడించారు.

అంతేకాకుండా తీవ్రమైన దృష్టి లోపాలతో బాధపడుతున్న 150 మందికి పైగా రోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి కంటిచూపును పునరుద్ధరించడం జరిగిందని, వైద్యుల ప్రత్యేక శ్రద్ధ కోసం ప్రతి క్యాంప్‌లో 60 మందికి మించకుండా నిశితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మంచి చేయాలనే తపన ఉన్న నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే నగరం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి మంత్రి నారాయణ చొరవే నిదర్శనమని కొనియాడుతూ డివిజన్ ప్రజల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సుధా ,రఫీ,9వ డివిజన్ అధ్యక్షులు పాకాల పెంచలయ్య, యూనిట్ ఇంచార్జ్ కొండ్రగుంట సురేష్, వెంగయ్య ఆటో యూనియన్ ప్రెసిడెంట్, చంద్రమౌళి బిఎల్ఎ, కమల్, కో యూనిట్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story