Nellore: అంతర్జాతీయ ప్రమాణాలతో డి ఎస్ ఆర్ ప్రభుత్వ పాఠశాల
Nellore: నెల్లూరు మూలాపేట ప్రభుత్వ పాఠశాల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.
Nellore: అంతర్జాతీయ ప్రమాణాలతో డి ఎస్ ఆర్ ప్రభుత్వ పాఠశాల
నెల్లూరు: అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమౌతున్న డిఎస్సార్ ప్రభుత్వ పాఠశాల పనులు పరిశీలించారు మంత్రి నారాయణ. దాదాపు10 కోట్ల సీఎస్సార్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని అభినందించారు మంత్రి. పనులు శరవేగంగా చేస్తున్న డిఎస్సార్ కంపెనీ సిబ్బందిని అభినందించారు. అత్యాధునికంగా రూపుదిద్దుకొంటున్న ప్లే గ్రౌండ్ ని పరిశీలించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ..
వార్డుల విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం అధికారులు వార్డుల విభజన చేస్తున్నారని చెప్పారు. డిఎస్స్సీ పైనా వైకాపా బురద చల్లే కార్యక్రమం చేస్తోందని, డిఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. వాళ్ళు ఎన్ని చేసినా అభివృద్ధి,సంక్షేమం ఆగదని, ఏపీ విద్యావ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని చెప్పారు.
అందులో భాగంగా నెల్లూరులోని ప్రభుత్వ హై స్కూల్స్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టామని చెప్పారు. గత ప్రభుత్వం మూసేసిన విఆర్సీని అదునునీకరించి ప్రారంభించామని చెప్పారు.
1100 మంది నిరుపేద పిల్లలకు ప్రవేశం కల్పించామని, కార్పొరేట్ ని మించిన విద్యను ఉచితంగా అందిస్తున్నామని, అదే తరహాలో మూలాపేట బాలికోన్నత పాఠశాలని డిఎస్సార్ కనస్ట్రక్షన్స్ కంపెనీ సిద్ధం చేస్తోందని, ఇంటర్ నేషనల్ స్టాండర్స్ తో అద్భుతంగా సిద్ధమౌతోందని చెప్పారు.మరో 14 స్కూల్స్ ని ఆధునీకరించేందుకు ముందుకొచ్చిన దాతలకు ధన్యావాదాలు తెలిపారు. విఆర్సీని తలదన్నే రీతిలో అన్ని స్కూల్స్ రూపురేఖలు మార్చేస్తామని చెప్పారు.
దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..
మూలాపేట ప్రభుత్వ స్కూల్ తో తనకు అవినాభావ సంబంధం ఉందని, ఈ స్కూల్ ఆధునీకరించే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మంత్రి కి ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ పనులు వేగంగా చేస్తున్నామని, అంతర్జాతీయ స్థాయిలో తరగతి గదులు,ల్యాబ్ లు రెడీ చేస్తున్నామని, ప్లే గ్రౌండ్ కూడా అద్బుతంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు.




