Nellore: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. రోల్ మోడల్ గా నెల్లూరు

Nellore: నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటన.

V. Narasimhulu, Nellore
Published on: 18 May 2026 8:11 AM IST
Nellore
X

Nellore: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. రోల్ మోడల్ గా నెల్లూరు

Nellore: నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగింది.. కార్పొరేషన్ లోని మూడవ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ. 45 వ డివిజన్ జేమ్స్ గార్డెన్ లో సీసీ రోడ్డు ప్రారంభించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ..

పరిశ్రమల స్థాపనపై సీఎం చంద్రబాబు,యువనేత లోకేష్ దృష్టిపెట్టారని చెప్పారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు నగరంలో ఆదివారం పర్యటించారు మంత్రి నారాయణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

దేశంలో కి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ కి తీసుకొచ్చారని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. నెల్లూరులో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, రాష్ట్రంలోనే నెల్లూరును రోల్ మోడల్ గా నిలుపుతామని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, దోమలు లేని నగరంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.

కాలువల ఆధునీకరణ పనులు పూర్తయితే నెల్లూరుకు ముంపు ముప్పు తప్పిపోతుందని, పేద పిల్లలకు విద్యను ఆస్తిగా ఇచ్చే కార్యక్రమం చేపట్టామని, దాతల సహకారంతో కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను విఆర్సీ తరహాలో ఆధునీకరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story