Nellore: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు!
Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆదివారం నెల్లూరు వీపీఆర్ కార్యాలయంలో మంత్రి నారాయణ, మేయర్ రూప్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
Nellore: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు!
నెల్లూరు: కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పొంగూరు నారాయణ, నెల్లూరు నగర మేయర్ శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.




