Nellore: స్థానిక ఎన్నికల తీర్పుపై ఇంకా పూర్తి అధ్యయనం చేయలేదు!

Nellore: స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పందించిన మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబుతో చర్చించి తదుపరి నిర్ణయం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Oct 2026 1:44 PM IST
Nellore
X

Nellore: స్థానిక ఎన్నికల తీర్పుపై ఇంకా పూర్తి అధ్యయనం చేయలేదు!

Nellore: బీసీ రిజర్వేషన్లు మినహా మిగతావన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయన్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. తీర్పును పరిశీలించి సీఎం చంద్రబాబుతో చర్చించి ముందుకు వెళ్తామని చెప్పారు...గత ప్రభుత్వం ఇచ్చింది నివాస కాగితాలే కానీ నిజమైన పట్టాలు కావని, గత ప్రభుత్వం ఇచ్చిన కాగితాలకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వరు, చెల్లుబాటు కావని అన్నారు.

స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ధర్మాసనం ఇచ్చిన తీర్పు పై స్పందించారు ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా అధ్యయనం చేయలేదన్నారు. ఇవాళ నెల్లూరు నగరంలో ప్రభుత్వ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారాయణ స్థానిక ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ ల అమలులో కోర్టు తీర్పు పై స్పందించారు.

ఏపీ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో బీసీ రిజర్వేషన్ మినహా మిగిలిన అన్యాయంశాలు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయన్నారు. ఎన్నికల వ్యవహారంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE