Nellore: మంత్రి నారాయణ విజన్.. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు

Nellore: నెల్లూరు వీఆర్ మున్సిపల్ స్కూల్‌లో 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి.

V. Narasimhulu, Nellore
Published on: 22 April 2026 6:44 PM IST
Nellore
X

Nellore: మంత్రి నారాయణ విజన్.. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు

Nellore: నెల్లూరు విద్యా చరిత్రలో సరికొత్త రికార్డు కార్పొరేట్ స్కూళ్లకు చెక్ పెట్టారు మంత్రి నారాయణ నాడు భిక్షాటన చేసిన బాలురు.. నేడు ఇంగ్లీష్‌లో ప్రసంగం ఇవ్వడంతో.. వి.ఆర్. మున్సిపల్ స్కూల్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది.. ప్రభుత్వ బడిలో 'గ్రాడ్యుయేషన్ డే'.. 180 మంది చిన్నారులకు పట్టాలు అందజేసిన కమిషనర్ వారి ప్రతిభ చూసి ఫిదా అయ్యారు..మంత్రి నారాయణ విజన్ -పేద విద్యార్థులకు ఫ్యూచర్ అయింది.. ఒక్క ఏడాదిలోనే 1000 మందికి పైగా విద్యార్థులు బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేశారు.ఇది వి.ఆర్. మున్సిపల్ హైస్కూల్ విజయగాథ.

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దూరదృష్టికి సజీవ సాక్ష్యం నెల్లూరు లోని వి.ఆర్. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్.పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్న ఆయన సంకల్పం నేడు వందలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు సైతం సవాల్ విసిరేలా ఈ ప్రభుత్వ బడిలోని 180 మంది చిన్నారులు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం నెల్లూరు విద్యా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మంత్రి నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాల, మొదటి అకడమిక్ ఇయర్‌లోనే ఊహించని విజయాలను నమోదు చేసింది. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ.

మంత్రి నారాయణ చొరవతో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యం, పౌష్టికాహారం,కార్పొరేట్ టీచర్ల బోధన వల్ల 1065 మంది విద్యార్థులు ఇక్కడ అద్భుతంగా రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 180 మంది విద్యార్థులకు ప్రీ-గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు,మెడల్స్ పంపిణీ చేశారు.పట్టాలు అందుకున్న ప్రతి విద్యార్థి వెనుక మంత్రి కృషి నిరంతర పర్యవేక్షణ దాగి ఉందన్న విషయాన్ని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒకప్పుడు భిక్షాటన చేస్తూ గడిపిన ఓ బాలుడు, నేడు ఈ స్కూల్లో చేరి ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటం ఒక గొప్ప మార్పు అని కమీషనర్ నందన్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా ఆ బాలుడికి అడ్మిషన్ ఇచ్చి చదువు పట్ల ఆసక్తి కలిగించారని, నేడు ఆ విద్యార్థి మూడో తరగతికి ప్రమోట్ అవ్వడం గర్వకారణమన్నారు . అంతర్జాతీయ స్థాయి వసతులు, నిష్ణాతులైన టీచర్లు,ఉచిత రవాణా సౌకర్యాలతో నెల్లూరులోని వీఆర్ ప్రభుత్వ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని కమిషనర్ నందన్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకటరావు,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, మరియు టీచర్లు గురుప్రసాద్, జయలక్ష్మి, హరిత, చంద్రకళ, ఎంఈఓ హమీద్ పాఠశాల సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story