Nellore: "నవ్యాంధ్ర రూపశిల్పి మంత్రి నారాయణ.. అట్టహాసంగా జన్మదిన వేడుకలు

Nellore: నెల్లూరులో రాష్ట్ర మంత్రి నారాయణ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

V. Narasimhulu, Nellore
Published on: 15 Jun 2026 11:05 AM IST
Nellore
X

Nellore: "నవ్యాంధ్ర రూపశిల్పి మంత్రి నారాయణ.. అట్టహాసంగా జన్మదిన వేడుకలు 

Nellore: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో, ముఖ్యంగా నెల్లూరు రూపురేఖలను మార్చడంలో అపర భగీరథుడిగా, నిరంతర శ్రామికుడిగా ప్రజాదరణ పొందిన అగ్రనేత, రాష్ట్ర మంత్రి వర్యులు నారాయణ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణాన్ని తలపించాయి.

విజన్ ఉన్న నాయకుడిగా, విద్యా రంగంలోనే కాక పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తూ, సదా ప్రజల సంక్షేమం కోసం పరితపించే మంత్రి నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన అభిమానులు, నారాయణ సైన్యం కొండంత ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు.

నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వేదికగా ఆయన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నిత్యం ప్రజాసేవలో తరిస్తూ, లీడర్‌షిప్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మంత్రి నారాయణ పై ఉన్న అపారమైన ప్రేమాభిమానాలతో, ఆయనను ఒక దేవుడిలా భావించే నారాయణ సైన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి, పదిమందికీ అండగా నిలిచే మంత్రి నారాయణ ఉన్నత వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ కేక్ కట్ చేయగా, ఆయనను దైవ సమానుడిగా ఆరాధించే నారాయణ సైన్యం ఉత్సాహంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

అనంతరం రమాదేవి అక్కడ ఉన్న నారాయణ సైన్యం సభ్యులందరికీ స్వయంగా కేక్ తినిపించి ఆనందాన్ని పంచుకోవడంతో క్యాంపు కార్యాలయం అంతా పండుగ శోభతో మురిసిపోయింది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story