Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ కుటుంబం ఎన్నికల ప్రచారం
Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తె షరణి 57, 63, 17వ డివిజన్లలో విస్తృత సమీక్షలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ కుటుంబం ఎన్నికల ప్రచారం
Nellore: ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసి కూటమి అభ్యర్థులు బి-ఫామ్‌లు అందుకోవడంతో... నెల్లూరులో ప్రచార సమరానికి తొలి అడుగు పడింది. రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తె షరణి నేతృత్వంలో విజయమే లక్ష్యంగా ప్రచార సమీక్షా సమావేశాలను ఘనంగా ప్రారంభించారు.
57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ షబానా, 63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జూబేర్ ఉద్దీన్, అలాగే 17వ డివిజన్ అభ్యర్థి తిరుమల నాయుడుల పరిధిలో కార్యకర్తలతో కలిసి ఈ సమీక్షా సమావేశాలను నిర్వహించారు.
శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తలే పార్టీకి అసలైన వెన్నుముక అని, తమ కుటుంబంలో సైనికుల్లా అహర్నిశలు శ్రమించే ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని నారాయణ కుటుంబ సభ్యులు భరోసానిచ్చారు... 57, 63, మరియు 17వ డివిజన్ల సమీక్షల అనంతరం.. 17వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో బాబు గిరిజన కాలనీ పరిధిలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని హోరెత్తించారు.
ఈ సందర్భంగా కాలనీలో అడుగడుగునా ప్రజలు అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణ నెల్లూరులో చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ వివరంగా తెలియజేస్తూ..కూటమి అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి కార్పొరేటర్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాలనీ వాసులను అభ్యర్థించారు.
నెల్లూరును ఒక మోడల్ స్మార్ట్ సిటీగా మార్చాలన్న మంత్రి నారాయణ విజన్‌ను ప్రతి ఇంటికీ చేరవేయాలని కోరారు. నారాయణ కుటుంబ సభ్యుల ప్రచార జోరు, అభ్యర్థులు ముమ్మరంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంతో డివిజన్లలో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.




