Nellore: 123 మున్సిపాలిటీల్లో రూ. 18 వేల కోట్లతో నీటి ప్రాజెక్టులు మంత్రి పొంగూరు నారాయణ

Nellore: నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన. రూ. 18 వేల కోట్లతో తాగునీటి పనులు. డిసెంబర్ నాటికి నెల్లూరు వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.

V. Narasimhulu, Nellore
Published on: 5 July 2026 4:01 PM IST
Nellore
X

Nellore: 123 మున్సిపాలిటీల్లో రూ. 18 వేల కోట్లతో నీటి ప్రాజెక్టులు మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు: రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో, రూ. 18 వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. నేడు సిటీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నారాయణ... కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు, పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వాన్ని విమర్శించే వైఎస్ఆర్సిపి గత ఐదేళ్లలో ఏమి చేశారో చెప్పాలని, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, వాళ్ల విమర్శలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదన్నారు మంత్రి నారాయణ. సిఎస్ఆర్ ఫండ్స్ తో స్కూల్స్ ఆధునికరణ చేస్తున్నామని, పేద పిల్లలకు మంచి చేస్తుంటే దాన్ని కూడా వైయస్సార్సీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. వైయస్సార్సీపి చీప్ పాలిటిక్స్ కి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని అన్నారు.

123 మున్సిపాలిటీల్లో 18 వేల కోట్లతో, మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని మరో 14 వేల కోట్లతో డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, సిటీలో 50 కోట్లతో 15 డ్రైన్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ డిసెంబర్ నాటికల్లా పనులు పూర్తి చేస్తామని నెల్లూరుకు వరద ముంపు తప్పిస్తామని చెప్పారు. నెల్లూరు సిటీలోని 15 ప్రభుత్వ హై స్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణతో ఆధునికరిస్తున్నామని అన్నారు. నెల్లూరును గ్రీన్ సిటీగా చేయడమే తన లక్ష్యమని చెప్పారు మంత్రి నారాయణ.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story