Nellore: ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల పట్టాలు మంత్రి పొంగూరు నారాయణ

Nellore: నెల్లూరులో 19 మంది ట్రాన్స్‌జెండర్లకు మంత్రి పొంగూరు నారాయణ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.50 వేల సొంత సాయం ప్రకటన.

A Praveen, Nellore
Published on: 12 Oct 2026 10:23 PM IST
Nellore
X

Nellore: ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల పట్టాలు మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు: ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి నారాయణ..నెల్లూరు నగరంలో ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం మరో చారిత్రక అడుగు వేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆగస్టు 1వ తేదీన 4వ డివిజన్లో మంత్రి నారాయణ గారు పర్యటించి పెన్షన్లు పంపిణీ చేస్తున్న సమయంలో, ట్రాన్స్ జెండర్లు తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఆయనను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి , తహశీల్దార్ మరియు జేసీలను అలాగే కమిషనర్ గారిని అప్రమత్తం చేసి వారికి తక్షణమే పట్టాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయగా, ఈరోజు 19 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లు మొత్తం ఎంతమంది ఉన్నారని మంత్రి నారాయణ ఆరా తీయగా 140 మంది ఉన్నారని తెలిపారు. స్పందించిన ఆయన, నగరవ్యాప్తంగా ఉన్న ఆ 140 మంది ట్రాన్స్ జెండర్లందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు.

అంతేకాకుండా, ఇళ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ తన సొంత మరియు పిల్లల నిధుల నుంచి 50,000 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ పట్టాలు అందుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 2.5 లక్షల సాయం కూడా త్వరలోనే అందేలా చూస్తామన్నారు. గతంలో కర్నూలులో ఉన్నప్పుడే ట్రాన్స్ జెండర్ల పెన్షన్ల కోసం జీవో తెచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ట్రాన్స్ జెండర్లు సహా అందరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

తమ సమస్యను సత్వరమే పరిష్కరించి ఇళ్ల పట్టాలు అందించినందుకు ట్రాన్స్ జెండర్లు అందరూ మంత్రి నారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జై నారాయణ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,మేయర్ సుజాత ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నగర తాసిల్దార్ మరియు , మాజీ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్..నగర అధ్యక్షుడు మామిడల మధు, శైలజ,నారాయణ రెడ్డి,స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore