Nellore: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి నారాయణ జన్మదిన శుభాకాంక్షలు!

Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Nov 2026 9:28 PM IST
Nellore
X

Nellore: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి నారాయణ జన్మదిన శుభాకాంక్షలు!

Nellore: కోవూరు శాసనసభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి జన్మదినం సందర్భంగా నెల్లూరు ఎంపీ కార్యాలయంలో సందడి నెలకొంది. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులోని వేమిరెడ్డి ఎంపీ కార్యాలయానికి స్వయంగా విచ్చేసి, ప్రశాంతి రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమెకు భారీ పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందించడంతో కార్యాలయ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది.ప్రజాసేవ పట్ల ప్రశాంతి రెడ్డికి ఉన్న నిబద్ధతను కొనియాడుతూ, భగవంతుని ఆశీస్సులతో ఆమెకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు.

కోవూరు నియోజకవర్గ అభివృద్ధిలోనూ, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా భక్తుల సేవలోనూ ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE