Nellore: జూలై నెలాఖరుకు ఏపీలో 107 చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభం
Nellore: ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. దొంతాలి డంపింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు.
Nellore: జూలై నెలాఖరుకు ఏపీలో 107 చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభం
నెల్లూరు: డంపింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పర్యవేక్షించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ. పనులు శరవేగంగా సాగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ..
గత ప్రభుత్వం చెత్త పరిపాలన చేసిందని, ప్రజలపై చెత్తపన్ను వేసిందని, 153 లక్షల చెత్తను రాష్ట్రంపై వదిలి వెళ్ళిందని చెప్పారు. రెండేళ్లలో 130 లక్షల టన్నుల చెత్త తొలగించామని చెప్పారు. మరో 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతోందని చెప్పారు. జూలై ఆఖరుకల్లా మొత్తం తొలగిస్తామని చెప్పారు.గుంటూరు,విశాఖలో వెస్ట్ ఎనర్జీ ప్లాంటుల్లో రోజుకి 2800 టన్నుల చెత్త బర్న్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు.
2014 లో శాంక్షన్ చేసిన ప్లాంట్లను గత పాలకులు రద్దు చేశారని, అ ప్లాంట్లన్నీ పూర్తయి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రోజుకు వచ్చే 7 వేల టన్నుల చెత్త ఆ రోజే బర్న్ అయిపోయేదని చెప్పారు. అవగాహన,విజన్ లేక ప్లాంట్ల ఏర్పాటును గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక మరో ఆరు ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం అనుమతిచ్చారని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని,
రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. జులై నెలాఖరుకి అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభిస్తామని చెప్పారు. దొంతాలిలో లక్ష టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని, ఈ నెలాఖరుకి చెత్త మొత్తం తొలగిస్తామని చెప్పారు. దొంతాలిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జిందాల్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని, రెండేళ్లలో పనులు పూర్తి చేసి ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. అది ప్రారంభిస్తే ప్లాంట్ కి 100 కిలోమీటర్ల పరిధిలో ఉంటే చెత్తను
ఏరోజుకారోజు బర్న్ చేస్తామని చెప్పారు .ఏపీ ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. సీఎం విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామని, 300 కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్,ఎస్ ఈ జానీ,జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ,జిగ్మా కంపెనీ ప్రతినిధులు,నారాయణ విద్యాసమస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




