Nellore: నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

Nellore: నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ పర్యటన. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం నెమ్మదిగా సాగడంపై అసహనం.

V. Narasimhulu, Nellore
Published on: 6 Jun 2026 1:19 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

Nellore: రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. యనమల వారి దిన్నెలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ప్రోగ్రామును పరిశీలించిన మంత్రి నారాయణ, మరో నెల రోజుల్లో సర్ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది.

ఇవాళ ఉదయం నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పర్యటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్.. సర్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 47% మాత్రమే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో దానిని వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. మరో నెల రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తయ్యేలా అధికారులు సర్ ప్రోగ్రాం ను వేగవంతం చేయాలని ఆయన మీడియా కు చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story