Nellore: మంత్రి లోకేష్ నెల్లూరు పర్యటనకు పక్కా ఏర్పాట్లు: నారాయణ!
Nellore: నెల్లూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన, పాఠశాలల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితలతో మంత్రి పొంగూరు నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Nellore: మంత్రి లోకేష్ నెల్లూరు పర్యటనకు పక్కా ఏర్పాట్లు: నారాయణ!
నెల్లూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా స్టోన్ హౌస్ పేటలోని RSR, మూలాపేటలోని DSR పాఠశాలల ప్రారంభోత్సవం జరుగుతున్న విశిష్ట పర్యటనను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కుమార్తె పొంగూరు షరణి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా DSR పాఠశాల ప్రాంగణంలోనే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వేజెండ్లలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా.. పక్కా భద్రత, విఐపి ప్రోటోకాల్, ట్రాఫిక్ నియంత్రణతో పాటు హాజరయ్యే విద్యార్థులు, ప్రజల సౌకర్యాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.




