Nellore: సీఎం, డిప్యూటీ సీఎంల పర్యటనను చారిత్రాత్మకం చేయాలి: మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తిక్కన ప్రాంగణంలో మంత్రి పొంగూరు నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష పల్లె పండుగ ఏర్పాట్లపై దిశానిర్దేశం.

A Praveen, Nellore
Published on: 28 Sept 2026 11:44 PM IST
Nellore
X

Nellore: సీఎం, డిప్యూటీ సీఎంల పర్యటనను చారిత్రాత్మకం చేయాలి: మంత్రి నారాయణ!

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా జరిగింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంయుక్తంగా హాజరవుతున్న ప్రతిష్ఠాత్మక పల్లె పండుగ కార్యక్రమం మరియు జిల్లా పర్యటనను అత్యంత వైభవంగా, ఎలాంటి చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వకుండా చారిత్రాత్మకంగా విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశంలో ప్రణాళికలు రూపొందించారు.

ఈసమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతు, విఐపిలు, నాయకులు మరియు లక్షల్లో తరలివచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్, విద్యుత్ మరియు రవాణా శాఖల అధికారులు వంద శాతం సమన్వయంతో రౌండ్-ది-క్లాక్ పనిచేయాలని ఆదేశించారు. విఐపి భద్రత, స్పష్టమైన ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, పక్కా ట్రాఫిక్ మళ్లింపు ప్లాన్లు అమలు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే సభకు వచ్చే జనాభా కోసం భారీ షామియానాలు, నిరంతర తాగునీరు, మజ్జిగ పంపిణీ మరియు అత్యవసర వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. సీఎం, డిప్యూటీ సీఎం ద్వయం తొలిసారిగా ఈ వేదికపైకి వస్తున్నందున, ప్రతి శాఖాధిపతి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఈ పర్యటనను నెల్లూరు చరిత్రలోనే ఓ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా మార్చాలని ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore