Nellore: నెల్లూరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం!
Nellore: నగరంలోని 15 పాఠశాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు.
Nellore: నెల్లూరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం!
నెల్లూరు:నెల్లూరు నగరంలోని 15 పాఠశాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కూడా మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.
నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.స్టోన్ హౌస్ పేటలోని ఆర్.ఎస్.ఆర్ పాఠశాల ఆధునీకరణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కుమార్తె పొంగూరు షరణిలతో కలిసి ఉపాధ్యాయులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ ఆర్ లో పాత రేకుల షెడ్ల స్థానంలో 41 గదులతో అత్యాధునిక భవనాలను నిర్మించడమే కాకుండా, నారాయణ విద్యాసంస్థల ఫౌండేషన్ సపోర్ట్‌తో ప్రభుత్వ స్కూళ్లలోనే కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి తెలిపారు.
నగరంలోని 15 స్కూళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కూడా ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు...గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై మూతపడి ఉన్న వి.ఆర్ స్కూల్‌ను, కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ మేరకు వెంటనే పునఃప్రారంభించామని తెలిపారు. ఈ స్కూల్లో కేవలం 1,000 సీట్లు ఉంటే, రికార్డు స్థాయిలో 2,000 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోటీ పడటం ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇదే స్ఫూర్తితో నెల్లూరు నగరంలోని మరో 15 పాఠశాలలను దాతల సహకారంతో కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేయాలని నిర్ణయించామని, దాతలు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల ఆర్థిక సహాయంతో కోట్ల వ్యయంతో నూతన భవనాలను నిర్మించామన్నారు.
మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు నారాయణ విద్యాసంస్థల ప్రతినిధి పొంగూరు షరణి నేతృత్వంలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, మరియు క్వశ్చన్ పేపర్లను ఉచితంగా అందజేస్తూ అండగా నిలుస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, కష్టపడే విద్యార్థులు ఉన్నారనివారికి సరైన మార్గదర్శకత్వం అందిస్తే అద్భుతాలు సాధిస్తారన్నారు.స్కూళ్లలో విద్యా ప్రమాణాలపై నిరంతర నిఘా ఉంచేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సమీక్షలు జరుగుతాయని, నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కూడా వేగంగా ఆధునీకరించి ప్రభుత్వ విద్యా రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తామని మనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్,డిఈఓ బాలాజీ రావు,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,ప్రభుత్వ హైస్కూల్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.




