Nellore: నెల్లూరు మహానాడుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న నేతలు
Nellore: నెల్లూరులో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్ శనివారం సమీక్ష నిర్వహించారు.
Nellore: నెల్లూరు మహానాడుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న నేతలు
Nellore: రాష్ట్రం గర్వించేలా మహానాడు విజయవంతానికి మంత్రులు, ఎమ్మెల్యేల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల హైలెవల్ మీటింగ్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది..పక్కా ప్లాన్ తో నేతలు సిద్ధమయ్యారు. నెల్లూరులో నిర్వహించనున్న మహానాడు పై మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా అధ్యక్షుడు,
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొని మహానాడు వేదిక ఖరారు, బహిరంగ సభ స్థలం, వాహనాల పార్కింగ్ మరియు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే అతిథులకు, కార్యకర్తలకు కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరు జిల్లా ఇచ్చే ఆతిథ్యం రాష్ట్రస్థాయిలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా, మహానాడును కళ్లుమిరుమిట్లు గొలిపే రీతిలో విజయవంతం చేసేందుకు నేతలందరూ సమన్వయంతో భారీ ప్రణాళికను సిద్ధం చేశారు.




