Atmakur: ఎన్టీఆర్ విగ్రహం పక్కనే బుడ్డా వెంగళరెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ!

Atmakur: వెలుగోడు తెలుగుగంగ జలాశయం వద్ద మాజీ మంత్రి దివంగత బుడ్డా వెంగళరెడ్డి కాంస్య విగ్రహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 11 Aug 2026 6:34 PM IST
Atmakur
X

Atmakur: ఎన్టీఆర్ విగ్రహం పక్కనే బుడ్డా వెంగళరెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ!

ఆత్మకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఒకనాటి ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత బుడ్డా వెంగళరెడ్డి కాంస్య విగ్రహాన్ని వెలుగోడు తెలుగు గంగ జలాశయం వద్ద ఆవిష్కరించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మానస పుత్రిక తెలుగు గంగ జలాశయం వద్ద ఉన్న ఆయన విగ్రహం పక్కనే స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి గ్రహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలతో కలిసి ఆవిష్కరింపజేశారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండల కేంద్రంలో ఉన్న తెలుగు గంగ జలశయానికి అప్పటి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్ 27ఏప్రిల్ 1983లో శంకుస్థాపన చేశారు. ఆ జలశయం వద్ద రాయలసీమ కరువు నివారణకు అలాగే మద్రాసు కు తాగునీటిని అందించి లక్షలాది బీడు భూములకు సాగునీటిని అందించడం మహనీయుల స్ఫూర్తిని భవిష్య తరాలకు తెలియజేసేందుకు ఈ విగ్రహావిష్కరణ జరిగిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. పదవులు అలంకరణ కాదని ప్రజలకు సేవ చేయడానికే నాయకుడని ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

వెలుగోడు తెలుగు గంగ జలాశయం వల్ల రాయలసీమ కే కాక నెల్లూరు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసి అన్నదాతలను ఆదుకునే గొప్ప సాగునీటి పథకమని పలువురు వక్తలు స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి, ఎన్టీఆర్ లను కొనియాడారు.

ఆసియా ఖండంలోనేనా అతిపెద్ద మట్టికట్ట జలాశయం తెలుగు గంగ అని.. దేశంలో ఏ జలాశయానికి లేనివిధంగా 1 ఆర్, 1 ఎల్ తూములు ఏర్పాటు చేయకుంటే తన పదవికి రాజీనామా లేఖను అప్పటి సీఎం ఎన్టీఆర్ కు ఇచ్చి ఈ రెండు తూములను సాధించడం వల్ల ఈ రోజు సుమారు 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరు అందుతుందంటే .. స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి కృషి వల్లనే అని పలువురు కొనియాడారు. స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీశైలం, నందికొట్కూరు నియోజక వర్గాలనుంచి తెదేపా నాయకులూ, రైతులు , కార్యకర్తలు హాజరయ్యారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story