Nellore: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కావలిలో సేవా కార్యక్రమాలు
Nellore: కావలిలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, చలివేంద్రం ప్రారంభం.
Nellore: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కావలిలో సేవా కార్యక్రమాలు
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను కావలిలో ఘనంగా నిర్వహించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం స్థానిక శివాలయంలో ప్రత్యేక కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి గారి ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు. తదుపరి రైతు బజార్ కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలివేంద్రాన్ని ప్రారంభించి ఉచితంగా చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




