Sullurpeta: రూ. 26.70 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Sullurpeta: సూళ్ళూరుపేటలో 33 మంది నిరుపేద బాధితులకు రూ. 26.70 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పంపిణీ చేశారు.
Sullurpeta: రూ. 26.70 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Sullurpeta: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా కూటమి ప్రభుత్వం కొండంత భరోసా కల్పిస్తోందని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం సూళ్ళూరుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 33 మంది నిరుపేద బాధితులకు రూ. 26,70,040 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆమె స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. విజయశ్రీ మాట్లాడుతూ, పేద ప్రజల ప్రాణాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
ఒక్క రూపాయి లంచం కానీ, ఎలాంటి పైరవీలకు కానీ తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా ప్రభుత్వ వైద్య సహాయం అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నియోజకవర్గంలో ఆపదలో ఉన్న బాధితులకు వేగవంతంగా సహాయం అందేలా నిరంతరం ముఖ్యమంత్రి కార్యాలయంతో సమన్వయం చేసుకుంటున్నామని, ప్రజారోగ్య పరిరక్షణలో సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని ఎల్లప్పుడూ ముందంజలో ఉంచుతామని ఆమె వెల్లడించారు.
ఇప్పటివరకు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాధించిన పురోగతి వివరాలను చూస్తే, మొత్తం 661 మంది లబ్ధిదారులకు కలిపి రూ. 6,01,06,144 (రూ. 6.01 కోట్లు) మేర ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
ఇందులో 651 మంది బాధితులకు రూ. 5,62,17,440 విలువైన సాధారణ చెక్కులు పంపిణీ చేయగా, అత్యవసర ఆసుపత్రి చికిత్సల కోసం 10 మందికి రూ. 38,88,704 విలువైన ఎల్‌ఓసీ (LOC) పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నానని, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకునేలా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులకు అండగా నిలుస్తున్న ఆమె సేవలను స్థానికులు కొనియాడారు. సూళ్ళూరుపేట AMC ఛైర్మన్ అకుతోట రమేష్,ఏపీ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, శ్రీచెంగాళమ్మ ఆలయ కమిటీ తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఈ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




