Vinjamur: వింజమూరు టీడీపీ నేత గొంగటి రఘునాథ రెడ్డి మృతి పట్ల సంతాపం!
Vinjamur: వింజమూరు టీడీపీ సీనియర్ నాయకుడు గొంగటి రఘునాథ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి. భౌతికకాయానికి నివాళులర్పించి పరామర్శ.
Vinjamur: వింజమూరు టీడీపీ నేత గొంగటి రఘునాథ రెడ్డి మృతి పట్ల సంతాపం!
Vinjamur: వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మండల కన్వీనర్,మాజీ సొసైటీ చైర్మన్ గొంగటి రఘునాథ రెడ్డి మృతి పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి,వింజమూరు ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.
రఘునాథ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులోని ఆయన నివాసానికి చేరుకున్నారు.పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గొంగటి రఘునాథ రెడ్డి ఎంతోకాలంగా చేసిన సేవలు అభినందనీయమన్నారు. వింజమూరు మండలంలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడిగా రఘునాథ రెడ్డి సేవలు పార్టీ శ్రేణుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.రఘునాథ రెడ్డి వంటి సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని,ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులకు కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో రఘునాథ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.




