Udayagiri: పల్లె పండుగ 3.0 విజయవంతంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు!
Udayagiri: ఉదయగిరి నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
Udayagiri: పల్లె పండుగ 3.0 విజయవంతంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు!
Udayagiri: పల్లె పండుగ 3.0 విజయవంతం చేయుటకు సహకరించిన నాయకులకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, అధికారులు, కూటమి నేతలను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల భాగస్వామ్యంతో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో సహకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డిలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకుల తరపున ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా, ఇంచార్జి మంత్రివర్యులు ఫరూక్ అబ్దుల్లా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కార్యక్రమ పరిశీలకులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, గిద్దలూరు శాసనసభ్యులు ముట్టుమాల అశోక్ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామంచెర్ల జనార్దన్, గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్.
వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సూళూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, శాసనమండలి సభ్యులు కంచెర్ల శ్రీకాంత్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ ఎస్.కె. అబ్దుల్ అజీజ్, ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ చైర్మన్ జెడ్. శివప్రసాద్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, కనీస వేతనాల బోర్డు రాష్ట్ర చైర్మన్ పెల్లకూరు శ్రీనివాసులు రెడ్డి, ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి, టిడ్కో (TIDCO) రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మీగడ ఓబుల్ రెడ్డిలకు పత్రికాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే, జోనల్ కోఆర్డినేటర్ గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ప్రాంగణ పరిశీలకులు, మాజీ హుండి ఎమ్మెల్యే ప్రస్తుత APIIC చైర్మన్ మంతెన రామరాజు, కృష్ణా జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బండారు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, వివిధ శాఖల జిల్లాలోని అధికారులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు తరపున ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా పల్లె పండుగ 3.0 కార్యక్రమమునకు మండలాల వారీగా పరిశీలకులుగా వ్యవహరించినటువంటి సీతారామపురం మండల పరిశీలకులు గుంటూరు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, ఉదయగిరి మండల పరిశీలకులు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ రంగినేని చెంచయ్య, వరికుంటపాడు మండల పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు సభ్యులు కే.కే. చౌదరి, కొండాపురం మండల పరిశీలకులు బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు.
జలదంకి మండల పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ సహకార ఆర్థిక సంస్థ సభ్యులు సి.ఆర్. రాజన్, కలిగిరి మండల పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల-ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తొలగరి, కావలి సంక్షేమ అభివృద్ధి సొసైటీ ప్రతినిధి కందూరి నాగేశ్వర నాయుడు, వింజమూరు మండల పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దుత్తలూరు మండల పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ సభ్యులు జి. నరసింహ యాదవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజలు అందించిన సహకారం ఎంతో కీలకమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
నాయకుల సూచనలు, అధికారుల సమన్వయం, కార్యకర్తల కృషి, ప్రజల భాగస్వామ్యం కలిసివచ్చినప్పుడే ఇలాంటి భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.
పల్లె పండుగ 3.0 విజయవంతం కావడం సమిష్టి కృషికి, సమన్వయానికి, ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొంటూ, కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు తరపున ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




