Kavali: కావలిలో ఘనంగా డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్ర!
Kavali: నెల్లూరు జిల్లా కావలిలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్ర అశ్రునయనాల నడుమ సాగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాడి మోశారు.
Kavali: కావలిలో ఘనంగా డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్ర!
Kavali: నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో ప్రముఖ వైద్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు అంతిమయాత్ర సోమవారం అత్యంత అశ్రునయనాల నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొని డాక్టర్ ప్రభాకర్ నాయుడు భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా పాడి మోసి, ఆయనపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితర ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రభాకర్ నాయుడు పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు, వైద్యరంగానికి డాక్టర్ ప్రభాకర్ నాయుడు అందించిన నిరుపమాన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
కావలి పట్టణంలోని రామ్మూర్తిపేటలోని ఆయన నివాసం నుండి ప్రారంభమైన అంతిమయాత్ర బాలకృష్ణ నగర్ స్మశానవాటిక వరకు కొనసాగింది. యాత్ర పొడవునా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ నడిచారు. తమ ప్రియతమ వైద్యుడిని, నేతను కడసారి చూసేందుకు వచ్చిన వేలాది మంది పట్టణ ప్రజలు, రాజకీయ, సామాజిక, వైద్య రంగాల ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి డాక్టర్ ప్రభాకర్ నాయుడు కి అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.




