Kavali: కావలి అభివృద్ధికి స్వర్ణయుగం ప్రారంభం
Kavali: సీఎం చంద్రబాబు నాయకత్వంలో కావలి అభివృద్ధికి స్వర్ణయుగం ప్రారంభమైందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు.
Kavali: కావలి అభివృద్ధికి స్వర్ణయుగం ప్రారంభం
కావాలి: రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్ భారీ పరిశ్రమలతో కావలికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతోందని చెప్పారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కావలి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు...సంక్షేమ ప్రదాత చంద్రబాబు అని అన్నారు
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ...
తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విచ్చేసిన తుమ్మలపెంట ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో నెలకొన్న రాక్షస పాలనకు ముగింపు పలికి, ప్రజల సంక్షేమం – అభివృద్ధి లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు “మత్స్యకారుల సేవ” ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమన్నారు. ఈ వయసులో కూడా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రతి వర్గం సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం తీసుకుంటున్న చర్యలు చారిత్రాత్మకమని పేర్కొంటూ, 2 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు కుటుంబ వ్యవస్థకు బలాన్నిచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పెద్ద ఎత్తున సామాజిక పింఛన్లు పంపిణీ మొదలైన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.
కావలి నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్ రిఫైనరీ, దగదర్తి ఎయిర్‌పోర్ట్, ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్, ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి భారీ ప్రాజెక్టులు కావలి పరిసర ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చనున్నాయని అన్నారు. బీపీసీఎల్ రిఫైనరీ రావడం వల్ల కావలి ప్రాంతం జాతీయ స్థాయి పారిశ్రామిక మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందన్నారు. కావలి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణ యుగం ప్రారంభమైందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
కావలి నియోజకవర్గంలోని 24 మత్స్యకార గ్రామాల మత్స్యకారులు తమ గ్రామం నుంచి నేరుగా సముద్రంలోకి వెళ్లేందుకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మట్టి రోడ్లు నిర్మించాలని, ఇందుకు 6.19 కోట్లు అవసరమవుతాయని, మంజూరు చేయాలని సీఎంకు విన్నవించారు. తీర ప్రాంతంలో రూ.6. 20 కోట్లతో బకింగ్‌హామ్ కెనాల్ పూడిక తీసి అభివృద్ధి చేస్తే మత్స్యకారులు, రైతులు, స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే కొండేటి డ్రెయిన్‌ను రీషెడ్యూల్ చేసి సమగ్ర అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు.
బీపీసీఎల్ ప్రాజెక్ట్ కావలి నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే కాలంలో కావలి ప్రాంతం పరిశ్రమలు, ఉపాధి, వాణిజ్యం, మౌలిక వసతుల పరంగా రాష్ట్రంలోనే ఆదర్శ ప్రాంతంగా నిలుస్తుందన్నారు. కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో కావలి పట్టణాన్ని “కనక పట్టణం”గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు.




