Nellore: మా జెండా అజెండా ఒక్కటే నెల్లూరు రూరల్ అభివృద్ధి.. ఎమ్మెల్యే!
Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని కలివెలపాలెంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Nellore: మా జెండా అజెండా ఒక్కటే నెల్లూరు రూరల్ అభివృద్ధి.. ఎమ్మెల్యే!
Nellore: నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో సీ.సీ. రోడ్డుకు శంకుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాము. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, కో క్లస్టర్ ఇంచార్జ్ కుంచనపల్లి శివకుమార్, కలివెలపాలెం పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు వేడిచెర్ల వెంకటేశ్వర్లు యాదవ్, చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి, కామయ్య, అత్తులూరు ఈశ్వరయ్య,
కువ్వాకుల శ్యామయ్య,వై.శ్రీనివాసులు రెడ్డి, ఎన్.సురేందర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, వెడిచర్ల శ్రీనివాసులు యాదవ్, వెడిచర్ల హజరత్ యాదవ్, పోతయ్య, బి.కిషోర్ నాయుడు, కె.శివప్రసాద్, డేగ సేనయ్య, కువ్వాకుల వెంకటరమణయ్య, ఆమూలూరు శ్రీనివాసులు, రావుల మధుబాబు, జడ రాజేష్, రవి, లక్ష్మణ్, దాసరి వెంకట శేషయ్య, ఉడత విజయ్,రాజశేఖర్, పి.భాస్కర్, డేగా సీనియ్య, మేకల క్రిష్ట్రయ్య, శ్రీనయ్య రావుల, కేశవ్ రావుల, నల్లయ్య, ఈపూరు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.




