Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి.
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.




