Nellore: నెల్లూరులో ఇంటింటికీ పెన్షన్లు.. పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ 21వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి.
Nellore: నెల్లూరులో ఇంటింటికీ పెన్షన్లు.. పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Nellore: ఉదయం 21వ డివిజన్ ఉమారెడ్డిగుంటలో ఇంటింటికి వెళ్లి, అవ్వ తాతలకు పెన్షన్ ను పంపిణీ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తుందని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెలా 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు, కో క్లస్టర్ ఇంచార్జ్లు,డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




