Nellore: జగన్‌కు ఏమైంది? హిందూ దేవుళ్లను తిట్టే రావణ్‌కు మద్దతా!
Nellore: హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్‌కు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వడాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుపట్టారు.
Nellore: జగన్‌కు ఏమైంది? హిందూ దేవుళ్లను తిట్టే రావణ్‌కు మద్దతా!
నెల్లూరు: హిందూ దేవుళ్ళు ఆచార సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన ప్రశ్న రావణ్ కు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకడాన్ని ఆక్షేపించారు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్న రావణ్ వ్యవహారం పై ఇవాళ ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను ఎమ్మెల్యేగా కాకుండా ఓ సామాన్య భారతీయుడుగా మాట్లాడుతున్నా అంటూ మొదట తాను భారతీయుడిని, హిందువునని పరమతాలతో కలిసి నడిచే ధర్మం నాకు హిందూ ధర్మం నేర్పిందని అంటూ అన్ని కులాలు, మతాలను గౌరవించే తాను మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడానని క్రిస్టియన్ లకి అండగా ఉన్నానని అన్నారు.
ఇవాళ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులకు జగన్ మద్దతు ఇస్తుంటే మాట్లాడాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి హిందూ మత విశ్వాసాలపై మాటల దాడులు చేస్తున్న జోసఫ్ ప్రశ్న రావణ్ ని ఎలా సమర్ధిస్తారు అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు దేవుళ్ళని నమ్మడం, నమ్మకపోవడం వారి ఇష్టం దేవుళ్ళని తిట్టే అధికారం రావణ్ కు ఎవరు ఇచ్చారని అన్నారు ఓ పక్క హే రామ్ అంటావు, మరో పక్క రావణ్ ని సమర్ధిస్తావ్అ సలు మీకు ఏమైంది జగన్ ? అంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు.
తాను బాధతో అడుగుతున్నాను రావణ్ మాట్లాడిన మాటలు విన్నారా రాముడిని, రామాయణ, మహా బారతలని జోసఫ్ రావణ్ మాట్లాడిన మాటలు వినలేదా జగన్అ న్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రశ్న జోసఫ్ రావణ్ పై అనేక కేసులు పెట్టారని ఉగ్రవాదులని సమర్ధించే రీతిలో మాట్లాడారని అలాంటి వ్యక్తులపై దేశద్రోహం కేసులు పెట్టకుంటే ఇంక ఏ కేసులు పెట్టాలి జగన్ గారు అంటూ సంబోధించారు.మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించే ఇలాంటి వ్యక్తులని జగన్ సమర్ధించడం దారుణమన్నారు.దేశ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్ చేశారు ఇవాళ హిందూ ధర్మంపై దాడి చేస్తున్న వారు భవిష్యత్ లో ఇతర మతలపై దాడులు చేయరా...? ప్రశ్న రావణ్ కు మద్దతు ఇవ్వడంపై జగన్ క్షమాపణ చెప్పుకుంటే ప్రజలు మీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారు అంటూ ఆయన హెచ్చరికలు చేశారు.




