Nellore: రూ.857 కోట్ల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Nellore: రూ. 17 కోట్ల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను జెన్-జి యువతతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 10 Aug 2026 5:29 PM IST
Nellore
X

Nellore: రూ.857 కోట్ల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: నెల్లూరు 27వ డివిజన్ ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియం వద్ద 17 కోట్ల వ్యయం, 168 అభివృద్ధి పనులను జెన్-జి నలుగురు విద్యార్థినీ, విద్యార్థులు లోకేశ్వరి, లక్ష్మి జ్యోతి, హిరణ్ కుమార్, మౌర్య లతో కలసి ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

రానున్న రోజుల్లో యువతరం ఆకాంక్షలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి, యువత ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా పనిచేస్తానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓ ఏడాది క్రితమే రామలింగాపురం అండర్ బ్రిడ్జి రోడ్డుని 15 ఏళ్ళ యువకుడి చేత ప్రారంభింపచేశానని,

26 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తైన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన, టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాలా 857 కోట్ల రూపాయలు అని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు , కో క్లస్టర్ ఇంచార్జిలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story