Nellore: రూరల్‌లో రూ. 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెంలో రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 4 Oct 2026 1:52 PM IST
Nellore
X

Nellore: రూరల్‌లో రూ. 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 50 లక్షల రూపాయలతో సి.సి. రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేటాయించిన అభివృద్ధి పనుల విలువ అక్షరాల 966 కోట్లు అని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోనే 3-ఫేస్ కరెంట్ ను వేగవంతంగా పూర్తి చేసిన నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని,

సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దే దానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి చేస్తాడని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా నిధులు సాధించి నెల్లూరు రూరల్ ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు...

ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణకి, ఆనం రామనారాయణ రెడ్డికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, నెల్లూరు ఎ.ఎమ్.సి.

చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉలవపాటి ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, టీడీపీ నాయకులు పొన్నాల రామచంద్రా రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు కందల హరి యాదవ్, నేరెళ్ల బాలకృష్ణ,ముత్యాల సుబ్రహ్మణ్యం,

రియాజ్, ఫిరోజ్, నరసయ్య,, జనని బాబు, జితేంద్ర బాబు, నావాజ్ , మల్లి, అలియాజ్, షఫీ, చాంద్ బాషా, నరసింహ ఆచారి, వెంకటరమణ, చింత బాబు, శ్రీనివాసులు రెడ్డి, అశోక్ రెడ్డి , సురేష్ రెడ్డి, సురేష్, s అశోక్ రెడ్డి, నావాజ్, మల్లి, వెంకటరమణయ్య, అశోక్, గోపి, శ్రీనాథ్, బాబు, ఎన్. శ్రీనయ్య, ఎన్. నరసయ్య, నరసింహ ఆచారి, మల్లయ్య, శివయ్య ఆచారి, ఏం. వెంకటేశ్వర్లు, యు. శివ, వై. అనిల్, షేక్ షఫీ, జయచంద్ర, యు.వెంకటేశ్వర్లు, వెంకయ్య, రాజేంద్ర, రాజేష్, పారా శ్రీనయ్య, మహీంద్ర, చెంచయ్య, వసంత రావు, శివ, ఏడుకొండలు, దొడ్ల, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE