Nellore: "భూ అక్రమార్కులపై కోటంరెడ్డి కన్నెర్ర"

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భూ అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు.

V. Narasimhulu, Nellore
Published on: 14 Jun 2026 12:24 PM IST
Nellore
X

Nellore: "భూ అక్రమార్కులపై కోటంరెడ్డి కన్నెర్ర"

నెల్లూరు: భూ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రెవిన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్న భూ అక్రమార్కులకు ఇక ఊచలే అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు..నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భూఅక్రమాలకు పాల్పడే వారికి ఇక చుక్కలు కనపడనున్నాయి.

ఎంతోమంది కాయ కష్టం చేసి కొనుగోలు చేసిన భూములను కొందరు భూ అక్రమార్కులు దొంగ పట్టాలు చేసి ఆక్రమించడం, వాటిని ఇతరులకు అమ్మి కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఇటీవల కొన్ని ఘటనలకు సంబంధించి బాధితులు ఎమ్మెల్యే కార్యాలయంకు వెళ్లి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

తాము ఎంతో కష్టపడి సొంత స్థలాన్ని కొనుగోలు చేస్తే రూరల్ లో భూ అక్రమార్కులు చెలరేగిపోతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో స్పందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో స్వయంగా మాట్లాడారు.

భూ అక్రమాలకు పాల్పడే వారి పట్ల ఉపేక్షించవద్దని వారిపై ఉక్కుపాదం మోపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్పందించిన రెవిన్యూ పోలీస్ అధికారులు భూ అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రేపో, ఎల్లుండో భూ అక్రమార్కులు జైలు ఊచలు లెక్కబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయ్.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story