Kaluvai: టీడీపీ సమీక్షా సమావేశం అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే కురుగొండ్ల!

Kaluvai: కలువాయి మండలంలో టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం.

Madhav Goud, Nellore
Published on: 19 Oct 2026 7:06 PM IST
Kaluvai
X

Kaluvai: టీడీపీ సమీక్షా సమావేశం అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే కురుగొండ్ల!

Kaluvai: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రం లోని ఉమామహేశ్వర కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు, స్థానికసంస్థ లలో అభ్యర్థుల ఎంపిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలను నాయకులకు దిశానిర్దేశం చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి మండలంలో అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్ లలో టీడీపీ అభ్యర్థుల విజయ కేతనం ఎగురవేయాలన్నారు,కూటమి నాయకులు పరస్పరం సహకరించుకోవాలని కోరారు,మండలంలోని 10 సెగ్మెంట్లలలో 10 మంది అభ్యర్థులను ఖరారు చేసామని మిగిలిన రెండు సెగ్మెంట్ లను రేపటిలోగా ప్రకటిస్తామన్నారు, వైకాపా పార్టీ లాగా దౌర్జన్యాలు చేసే సంసృతి తెలుగుదేశం పార్టీకి లేదన్నారు, ప్రశాంత వాతావరణం లోనే ఎన్నికలు సజావుగా జరుగుతాయాన్నారు, ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామ్ రెడ్డి,సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, సోమయ్య యాదవ్ నాయుడు, రాపూరు మార్కెటింగ్ వైస్ చైర్మన్ గడ్డం కిషోర్ రెడ్డి,అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore