Gudur: గూడూరులో 7 ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్!
Gudur: గూడూరులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన 7 డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించి, సంస్థ సేవా గుణాన్ని కొనియాడారు.
Gudur: గూడూరులో 7 ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్!
గూడూరు: గూడూరు పట్టణంలో "మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో" ఏర్పాటుచేసిన 7 డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ లను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుత
నేడు ఎవరైనా చనిపోతే, దూర ప్రాంతాల నుంచి వచ్చే రక్త సంబంధీకులు, బంధువులు చివరి చూపు కోసం వచ్చేందుకు సమయం పడుతుందని, మృతదేహాన్ని ఎక్కువ సమయం ఉంచేందుకు ఫ్రీజర్ బాక్సులు ఎంతో అవసరమని, అందుకే తన తండ్రి పేరు మీద గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి బాక్సులు అందించామని తెలిపారు.
మానవతా సంస్థ ఒకేసారి ఏడు బాక్సులను ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, గూడూరు పట్టణం దాతలకు మారుపేరని, ప్రజలకు అవసరమైనప్పుడు ఫ్రీజర్ బాక్సులను ఉపయోగించుకోవాలని సూచించారు.... ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి , బాల కృష్ణంరాజు ,సోమిశెట్టి చెంచు రామయ్య ,రహీం, వాసు గౌడ్ ,నాగసూరు గోపాలరావు, బిల్లు చెంచురామయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




