Sarvepalli: ఈదురు గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం
Sarvepalli: సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలం ఈదురు గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
Sarvepalli: ఈదురు గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం ఈదురు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ అభ్యర్థిగా వెంపులూరి మనొహర్ జడ్పిటిసి అభ్యర్థిగా మన్యం శిళవ కుసుమాంబ లను సైకిల్ గుర్తు మీద మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు ప్రభుత్వంలో పేదలకు పెన్షన్ 4000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గాని అన్నారు ఏ రాష్ట్రంలోనూ 4000 పెన్షన్ లేదని ఈ సందర్భంగా తెలిపారు తోటపల్లి గూడూరు నుండి సాలిపేట వరకు మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నదని మరో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
జరిగిన అభివృద్ధిని చూసి తెలుగుదేశం కి ఓటు వేయాలని కోరారు అభివృద్ధి సంక్షేమం రెండు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి లేదని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు జరగకుండా ఆపడానికి కోర్టుకి వెళ్లి ప్రయత్నాలు చేసినా ఎన్నికల కమిషన్ యధావిధిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




