Nellore: జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు.. ఎమ్మెల్యే ప్రశాంతి

Nellore: నెల్లూరు జిల్లాలో యూరియా కొరత లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 13 Jun 2026 6:50 PM IST
Nellore
X

Nellore: జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు.. ఎమ్మెల్యే ప్రశాంతి

Nellore: జిల్లాలో యూరియా కొరత వైసిపి సృష్టించిన అపోహ మాత్రమేనన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈనెల 8వ తేదీ నుంచి యాప్ ద్వారా, ప్రభుత్వం యూరియా రైతులకు విడుదల చేసిందని, మొదటి ఎకరాకు 1.5 యూరియా కట్టలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది కనుక, ఎకరాకు మూడు బస్తాలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యాప్ లో ఎన్రోల్ చేసుకున్న ప్రతి రైతుకి ఎకరాకి, మూడు బస్తాలు చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు.

కొన్ని సాంకేతిక లోపాలు సరిదిద్దుకోవటం వల్ల, కాస్త ఆలస్యం జరిగిందే తప్ప, యూరియా కంపెనీలో ఎలాంటి యూరియా కొరత లేదని, ఇది కేవలం ప్రభుత్వం మీద ప్రతిపక్ష వైసిపి బురద చల్లడానికి చేసిన విమర్శ లేని వ్యాఖ్యానించారు. అలాగే ఖరీఫ్ పంట సాగు కోసం మొత్తం 55 వేల ఎకరాలకు గాను, ఇప్పటికే 42 వేల ఎకరాల నాట్లు పూర్తి అయ్యాయన్నారు. మరో ఏడు నుంచి పది రోజుల్లో 13 వేల ఎకరాలు కూడా నాట్లు పూర్తవుతాయని చెప్పారు.

ఇప్పటికే 4500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగిందని, ఈరోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. కోవూరు, ఇనమడుగు ఏరియాలో సుమారుగా 2500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేయడం జరిగిందని చెప్పారు. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకు యూరియా పంపేలా అందుబాటులో ఉంచామని చెప్పారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. యూరియా పంపిణీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story