Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మట్టి గణపతి పూజలు!
Nellore: నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మట్టి గణపతి పూజలు!
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం నందు వినాయక చవితి సందర్భంగా స్వామి వారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, జెన్ని రవణయ్య, మామిడాల మధు, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, ఊరందూరు సురేంద్ర బాబు, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, ఓం ప్రకాష్, అమృల్లా, పాల్ శెట్టి, జ్ఞానేంద్ర, దోర్నాల హరిబాబు, ఆశం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ ప్రతీ యేటా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో వినాయక చవితి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. విఘ్నాలు తొలిగి అనుకున్న పని విజయవంతం అయ్యేలా దీవించాలని ఏక దంతుడు విఘ్నేశ్వరుని వేడుకుంటూ పూజలు నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ లకు, కూటమి ప్రభుత్వానికి విఘ్నేశ్వరుని అండదండలు, ఆశీస్సులు లభించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో వారి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పూజా కార్యక్రమం ను జిల్లా టీడీపీ కార్యాలయంలో అత్యంత భక్తి శ్రద్దల నడుమ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాతావరణ మార్పులు, ఎల్ నినో పరిస్థితులు అనుకూలంగా మారి జిల్లా సస్యశ్యామలంగా మారేలా దీవించాలని విఘ్నేశ్వరుణ్ణి వేడుకున్నామని తెలిపారు.
రాష్ట్రం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు వాటిల్లకుండా సాగిపోవాలని, విఘ్నేశ్వరుని దీవెనలు కూటమి ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు, వారు తలపెట్టిన కార్యక్రమాలలో విఘ్నాలు తొలగి విజయవంతం కావాలని కోరారు.




