Nellore: నెల్లూరు జిల్లాలోని గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం!

Nellore: అందరి సహకారంతో నెల్లూరు జిల్లాలోని గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్నారు.

A Praveen, Nellore
Published on: 15 Nov 2026 7:29 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలోని గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం!

Nellore: నెల్లూరు నగరం రేబాల వారివీధి లో ఉన్న జిల్లా గ్రంథాలయంలో ఆ సంస్థ ఛైర్మన్ మేకపాటి శాంతి కుమారి ఆధ్వర్యంలో జరిగిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో శాసనమండలి సభ్యులు, టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్,మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి , డీఈవో బాలాజీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ జిల్లాలో విద్య, ఉపాధి అవకాశాలను అభివృద్ధి చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు.

జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లా శాసన సభ్యులు గ్రంథాలయాల పరిస్థితులు, భవన నిర్మాణాల అవసరాల గురించి మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంత్రి నారాయణ తీర్చిదిద్దుతున్నారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆర్.ఎస్.ఆర్. పాఠశాల, దేవిరెడ్డి కుటుంబ సహకారంతో డి.ఎస్.ఆర్. పాఠశాల అత్యున్నతంగా తీర్చిదిద్దబడ్డాయి.

మంత్రి నారాయణ సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ సిద్ధమవుతోంది, మైనార్టీ మహిళల కోసం ప్రత్యేక కళాశాల అందుబాటులోకి రానుంది.

నెల్లూరు నగరంలో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దబడుతున్న ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవాలకు స్వయంగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

విద్యాభివృద్ధి, గ్రంథాలయాలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆనాడు రేబాలా, దొడ్ల వంటి పెద్ద కుటుంబాలు ఎంతో విలువైన భూములను దాతృత్వంగా ఇచ్చారు.

ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆనాడు వారు అందించిన భూములను, ఆస్తులను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పిస్తోంది. జిల్లాలోని 63 కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాలను, 2 గ్రామ గ్రంథాలయాలను(విలేజ్ లైబ్రరీ) అందరి సహకారంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతాం.

A Praveen, Nellore

A Praveen, Nellore