Nellore: మైనార్టీ నాయకుడి సూపర్ చొరవ.. నెల్లూరు చలివేంద్రం వద్ద ఎమ్మెల్సీ సందడి!
Nellore: నెల్లూరు 43వ డివిజన్లో మైనార్టీ నాయకుడు జియాఉల్ హాక్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు.
Nellore: మైనార్టీ నాయకుడి సూపర్ చొరవ.. నెల్లూరు చలివేంద్రం వద్ద ఎమ్మెల్సీ సందడి!
Nellore: ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి మంచినీటి చలివేంద్రాలు మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు... ఇప్పటికే నెల్లూరు నగరంలో పలు కోడలలో మజ్జిగ చలివేంద్రాలతో ప్రయాణికులు కాసింత ఉపశమనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరు 43వ డివిజన్లో మైనార్టీ నాయకుడు జియాఉల్ హాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ, పుచ్చకాయ పంపిణీ చేశారు.సేవా కార్యక్రమాల్లో మైనార్టీ నాయకులు ఎల్లప్పుడూ ముందుంటారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ycp నాయకులు ఖలీల్ అహ్మద్, సిద్ధిక్, సమీర్ ఖాన్, అబ్దుల్ మస్తాన్, యస్థాని , అలీం, సుభాని, తదితరులు పాల్గొన్నారు.




