Budavada: అంగరంగ వైభవంగా హెచ్ఎం సుందర్ రామిరెడ్డి రిటైర్మెంట్ వేడుకలు

Budavada: బూదవాడ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాలువ సుందర్ రామిరెడ్డి 34 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 3 July 2026 9:20 PM IST
Budavada
X

Budavada: అంగరంగ వైభవంగా హెచ్ఎం సుందర్ రామిరెడ్డి రిటైర్మెంట్ వేడుకలు

Budavada: బూదవాడ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాలువ సుందర్ రామిరెడ్డి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు తిరుపతయ్య, ధనలక్ష్మి మాట్లాడుతూ 34 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని ఎంతో సంతృప్తిగా పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని వారి సేవలను ఘనంగా కొనియాడారు.

అనంతరం మండలంలోని ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై సన్మాన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జిలాని, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జొన్నా సత్యనారాయణ, బ్రాహ్మణపల్లి క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, చిలకపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారుతీ కేశవరెడ్డి, కంప సముద్ర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి,

బి.వి.ఎస్.ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఏపీ జేఏసీ జనరల్ సెక్రెటరీ సురేంద్ర రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బంకా సుబ్బారెడ్డి, బూదవాడ పంచాయతీ ఉపసర్పంచ్ సిరిగిరి ఈశ్వర్ రెడ్డి, ఎస్.ఎం.సి మాజీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి, కంప సముద్రం గ్రామానికి చెందిన కాంతా రెడ్డి, బ్రాహ్మణపల్లి వెంకటేశ్వర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రాజేంద్ర కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రమాదేవి, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు, గ్రామస్తులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story