Nellore: నెల్లూరులో కూటమి మేయర్, 72 డివిజన్ల అభ్యర్థులకు ఆత్మీయ విందు!

Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో 72 డివిజన్లలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్పొరేటర్ అభ్యర్థులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 28 Oct 2026 7:46 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కూటమి మేయర్, 72 డివిజన్ల అభ్యర్థులకు ఆత్మీయ విందు!

Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు 72 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, 72 మంది కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, జనసేన నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ ఎన్నికల పరిశీలకులు డూండీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి పొంగూరు నారాయణ చొరవతో నెల్లూరు నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE