Venkatagiri: వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యే!
Venkatagiri: వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.
Venkatagiri: వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యే!
Venkatagiri: వెంకటగిరి పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.
జాతర సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కలిసి వారు దర్శనం చేసుకున్నారు. అనంతరం జాతర ప్రాంగణంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలు, రద్దీ నియంత్రణ చర్యలు, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.




