Nellore: మధ్యతరగతి ఇంట స్టేట్ ర్యాంకుల పంట.. ఎంపీ వేమిరెడ్డి ఇంటికి టెన్త్ టాపర్లు!
Nellore: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో వింజమూరు శ్రీ నేతాజీ వికాస్ హైస్కూల్ విద్యార్థిని లిఖిత 598 మార్కులతో రాష్ట్రస్థాయిలో సెకండ్ ర్యాంక్ సాధించింది.
Nellore: మధ్యతరగతి ఇంట స్టేట్ ర్యాంకుల పంట.. ఎంపీ వేమిరెడ్డి ఇంటికి టెన్త్ టాపర్లు!
Nellore: నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థినులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. మెట్టప్రాంతం వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ హై స్కూల్ అండ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థిని సిహెచ్ లిఖిత పదవ తరగతి ఫలితాల్లో 598 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానం, అలాగే రాష్ట్రంలో రెండవ స్థానం సంపాదించింది. అలాగే 595 మార్కులతో ఎల్లాల భావన ప్రతిభ చూపగా వారు ఈ సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో ఎంపీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ వారిని అభినందించారు. మెట్ట ప్రాంతానికి చెందిన మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించడం సాధారణ విషయం కాదన్నారు. విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ నేతాజీ వికాస్ హై స్కూల్ సంస్థ డైరెక్టర్ ఎల్సి రమణారెడ్డి, కరస్పాండెంట్స్ కె.వి రత్నం, ఎన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




