Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన ములుమూడి గ్రామ నేతలు!
Nellore: నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామానికి చెందిన షేక్ సర్దార్, కాలేషా తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన ములుమూడి గ్రామ నేతలు!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాజకీయ చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ పరిధిలోని ములుమూడి గ్రామానికి చెందిన షేక్ సర్దార్, షేక్ కాలేషా తమ మిత్రబృందంతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరగా, నేతలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పదిమందికి మేలు జరిగేలా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రజాసేవలో ముందుండే వారికి స్థానిక శాసనసభ్యుడిగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా సమష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు.




