Nellore: అధికార పార్టీకి కమిషనర్ రబ్బర్ స్టాంప్: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి రబ్బర్ స్టాంప్‌లా మారారని, ఎన్నికల సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మండిపడ్డారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 24 Sept 2026 4:47 PM IST
Nellore
X

Nellore: అధికార పార్టీకి కమిషనర్ రబ్బర్ స్టాంప్: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలలో అధికార పార్టీ నియంత్రత్వం మరియు విచ్చలవిడితనం తో పాటు కమిషనర్ అధికార పార్టీకి రబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్పోరేటర్లు,డివిజన్ ఇన్ చార్జ్ లతో కలిసి హాజరై.. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నెలకొన్న అభ్యంతరాలను కమిషనర్ కి వివరించారు.

ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు డివిజన్ లలో అభ్యర్థుల రిజర్వేషన్స్ కు సంబంధించి లేనిపోని లీక్ లిస్తూ.. ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్న విషయం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.

కార్పొరేషన్ సమాచారం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరకముందే.. కొన్ని వాట్స్అప్ గ్రూపుల్లో .. సర్క్యులేట్ అవడం పట్ల అభ్యంతర వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని పార్టీల .. సమన్వయం..సూచనలతో .. సజావుగా నిర్వహిస్తామని కమిషనర్ గారు చంద్రశేఖర్ రెడ్డికి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ అధికార పార్టీ.. చెప్పిందానికల్లా తలూపుతూ.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు . కార్పొరేషన్ సమాచారాన్ని ముందస్తుగా కూటమి పార్టీలకు చేరవేస్తూ కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.నెల్లూరు నగర నియోజకవర్గంలో అధికార పార్టీ..నేతలు డివిజన్ లలో సీట్ల రిజర్వేషన్స్ కు సంబంధించి.. లేనిపోని మాటలు చెప్పి.. ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు.అధికార పార్టీ నేతలు..

కొంత మంది వద్దకు వెళ్లి.. ఈ డివిజన్ ఎస్సీ,లేదా బీసీ వస్తుందని చెబుతూ మీరు.. ప్రచారం చేసుకోండి.. అని కరపత్రాలు ముద్రించుకొండని అనధికారికంగా లీకులిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేలా కూటమి పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు కార్పొరేషన్ లోనే.. ఏ డివిజన్లో ఏ రిజర్వేషన్ వస్తుంది అన్న ప్రాథమిక సమాచారం లేదన్నారు.

కమిషనర్ చెప్పిన దాన్నిబట్టి రిజర్వేషన్స్ కు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో రిజర్వేషన్స్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఇవేమీ పట్టవన్నట్లు కూటమి పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అధికారులు చెప్పినట్లు రాజకీయ పార్టీలు వింటున్నాయా లేదా రాజకీయ పార్టీలు చెప్పినట్లు అధికారులు వింటున్నారా అన్న సందేహం కలుగుతుందన్నారు. అధికార పార్టీ చెప్పిన విధంగానే .. కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అలాగే కార్పొరేషన్ కి సంబంధించి అనేక అంశాలపై.. కమిషనర్ ని అడిగినప్పుడు.. కమిషనర్ .. సమాచారాన్ని దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ప్రజలు ఒకటే నిర్ణయించుకొని ఉన్నారు ఈ వెన్నుపోటు పార్టీని ఎప్పుడు తరిమికొట్టాలా..

మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలా.. అన్న దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. నామినేషన్ల విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి.. దాడులు చేయించి నామినేషన్ విత్ డ్రా చేయించె దిశగా అధికార పార్టీ దుర్మార్గాలకు పాల్పడే.. ఆలోచన చేస్తున్నట్లు.. అర్థమవుతుందన్నారు. అలాంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. కచ్చితంగా .. కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE