Nellore: కస్తూర్బా కళాక్షేత్రంలో మట్టి వినాయకుల పంపిణీ: కమిషనర్ వై.ఓ. నందన్
Nellore: కస్తూర్బా కళాక్షేత్రంలో మట్టి వినాయక ప్రతిమలను కమిషనర్ వై.ఓ. నందన్ పంపిణీ చేశారు. జల కాలుష్య నివారణకు మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు.
Nellore: కస్తూర్బా కళాక్షేత్రంలో మట్టి వినాయకుల పంపిణీ: కమిషనర్ వై.ఓ. నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.వో నందన్ శనివారం కస్తూర్బా కళాక్షేత్రం నందు మట్టి తో తయారు చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పెట్టుకుని పూజ చేసుకుని నిమజ్జనం చేయాలని తద్వారా జల కాలుష్యమును నియంత్రించ వచ్చునని ఈ సందర్భంగా తెలియచేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో మరియు రసాయనాలతో పెయింట్స్ వేసిన ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ . దినేష్, ఈ.ఈ. అనిల్ కుమార్, సచివాలయ కార్యదర్శులు సురేష్ బాబు, గంగాధర్, బాలకృష్ణ, సతీష్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, రమేష్, లక్ష్మయ్య, ఆశ్రిత, ప్రవల్లిక, ఉషా రాణి, వెంగయ్య , ప్రవీణ్, రామయ్య, తాజుద్దీన్, సుధీర్, ఈశ్వరయ్య, వెంకట్రావు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.




