Sangam: భర్తపై హత్యాయత్నం కేసులో భార్య ప్రియుడు అరెస్ట్
Sangam: అనసూయనగర్ లో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త పెంచల ప్రసాద్‌ను చంపేందుకు ప్రయత్నించిన భార్య కామాక్షి, ఆమె ప్రియుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sangam: భర్తపై హత్యాయత్నం కేసులో భార్య ప్రియుడు అరెస్ట్
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం అనసూయనగర్ లో భర్తను హత్య చేయడానికి యత్నించిన భార్య కామాక్షి, ఆమె ప్రియుడు వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు అనసూయ నగర్ కి చెందిన పెంచల ప్రసాద్ కు ముత్తుకూరుకి చెందిన కామాక్షి తో 12 ఏళ్ల క్రితం వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల కాలంలో భార్య కామాక్షికి నెల్లూరు రూరల్ దేవరపాలెంకు చెందిన వెంకటేష్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.ఇటీవల భర్తతో కలిసి ఉంటున్న సమయంలో కామాక్షి తన ప్రియుడు వెంకటేష్ ను ఇంటికి పిలిపించి దిండుతో భర్తను చంపేందుకు యత్నించింది. అప్రమత్తమైన ప్రసాద్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ కత్తితో దాడి చేయగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.




