Nellore: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా విడుదల!
Nellore: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు. చేయని తప్పుకు జైలు పాలు చేశారని, కక్ష సాధింపులు మంచివి కాదని వ్యాఖ్య.
Nellore: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా విడుదల!
Nellore: చేయని తప్పిదాన్ని... నెపాన్ని ఆరోపణలు చేస్తూ బాధపెట్టిన వారికి దేవుడు సరైన సమయం లో శిక్ష విధిస్తారని... కక్ష సాధింపు చర్యలు రాజకీయాల్లో మంచిది కాదన్నారు గుంటూరు తాజా మాజీ ఎమ్మెల్సీ ముస్తఫా. పలు కేసుల్లో జైలు పాలైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత కొద్ది కాలం క్రితం ఆయనపై పలు కేసుల్లో నిందితుడిగా జైలు పాలయ్యారు.
ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ చేయని నేరాన్ని నెపాన్ని చూపి తనను తన కుమారుడిని జైలు పాలు చేశారని వారు ఖచ్చితంగా అందుకు దేవుని కోర్టులో శిక్ష అనుభవిస్తారని ముస్తఫా అన్నారు.
నూజివీడు లో తమ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు నెల్లూరు జైలులో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించారని. తాము కూడా జైలు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని ముందుగానే చెప్పినట్లు ముస్తఫా తెలిపారు.




